పర్వతగిరి, జూలై 11 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన క్రీడాకారిణి జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్‌షిప్ గేమ్స్‌కు శుక్రవారం ఎంపికైంది.
ఇటీవల బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా చాంపియన్‌షిప్ ఎంపిక పోటీల్లో పాల్గొన్న ఆమె.. 400 మీటర్ల విభాగంలో లక్ష్యాన్ని 56.06 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థ్ధానంలో నిలిచి బంగారు పతకం సాధించింది.