దోహా: ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఈ నెల 18న జరిగే ఫైనల్స్‌కు ముందు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ఆవిష్కరించనున్నది. ప్రపంచంలో అత్యధికులు వీక్షించే ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఈ గౌరవం దక్కించుకోనున్న తొలి నటి దీపిక. కాగా గత నెలలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరో బాలీవుడ్ నటి నోరా ఫతే నృత్య కార్యక్రమం ప్రదర్శించడం తెలిసిందే. ఈ విధంగా ఒకే ప్రపంచకప్‌లో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు అరుదైన గౌరవం దక్కించుకోవడం విశేషం.