న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్ 3లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన దీపికా కుమారి రికర్వ్ వుమెన్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ అయింది. సోమవారం వరల్డ్ ఆర్చరీ ఈ కొత్త ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆదివారం జరిగిన రికర్వ్ వుమెన్స్ టీమ్, రికర్వ్ మిక్స్డ్ టీమ్, వుమెన్స్ వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ మూడు మెడల్స్‌తో ఆమె వరల్డ్ నంబర్ వన్ స్థానానికి వెళ్లింది అని వరల్డ్ ఆర్చరీ ట్విటర్లో వెల్లడించింది.
వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో రష్యాకు చెందిన ఎలెనా ఒసిపోవాను వరుస సెట్లలో దీపికా ఓడించింది. ఈసారి ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆర్చరీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళ దీపికా కుమారి. తన తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. దీనిని కొనసాగించడం ముఖ్యమని చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్పైనే తాను దృష్టి సారించినట్లు తెలిపింది. ఆర్చరీలో ఇప్పటి వరకూ ఇండియాకు ఒలింపిక్ మెడల్స్ రాలేదని, అందుకే ఈ ఈవెంట్ తనకు చాలా ముఖ్యమైనదని దీపికా కుమారి చెప్పింది.
This is going to take Deepika to the number one spot in the world rankings on Monday!
— World Archery (@worldarchery) June 27, 2021
🥇 🇮🇳 Deepika Kumari
🥈 🇷🇺 Elena Osipova
🥉 🇺🇸 Mackenzie Brown#ArcheryWorldCup pic.twitter.com/6yizeEndyo