అమ్మాన్ : ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు దీపక్ పునియా, ఉదిత్ రజతాలతో మెరిశారు. పురుషుల ప్రీస్టయిల్ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన 92 కిలోల విభాగంలో బరిలోకి దిగిన పునియా.. ఫైనల్లో 0-10తో ఇరాన్ రెజ్లర్ అమీర్ హోసేన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో ఫైనల్లో ఉదిత్ (61 కిలోలు) 4-6తో సుడా టకర చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.