బ్యాంకాక్ : థాయ్లాండ్ బాక్సింగ్ ఓపెన్లో భారత యువ బాక్సర్లు దీపక్, నమన్ తన్వర్ స్వర్ణాలతో మెరిశారు. పురుషుల 75 కిలోల విభాగం ఫైనల్లో దీపక్.. 5-0తో జవొఖిర్ (ఉజ్బెకిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించి పసిడి ఒడిసిపట్టాడు. పురుషుల 95 కిలోల ఫైనల్లో నమన్.. 4-1తో హాన్ యుఝెన్ (చైనా)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
మహిళల 80+ కిలోల విభాగం ఫైనల్లో కిరణ్.. 2-3తో తలిపొవ (కజకిస్థాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మిగిలిన మ్యాచ్లలో తమన్నా (51 కిలోలు), ప్రియ (57 కి.), సంజూ (60 కి.), సనేహ్ (70 కి.), లల్ఫక్మవి (80 కి.) కాంస్యాలతో సత్తా చాటారు. మొత్తంగా 19 మందితో ఈ టోర్నీ బరిలో నిలిచిన భారత్.. 8 పతకాలు సాధించడం విశేషం.