ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఐపీఎల్ సీజన్లో మూడో సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (116) అవుటయ్యాడు. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అలసిపోయిన అతను ఆ షాట్లో సరిపోయేంత బలాన్ని చూపించలేకపోయాడు.
ముస్తాఫిజుర్ వేసిన యార్కర్‌ను బౌండరీ దాటించలేకపోయాడు. ఈ క్రమంలో బౌండరీలైన్ వద్ద ఉన్న వార్నర్ అతని క్యాచ్ అందుకున్నాడు. దీంతో బట్లర్ సూపర్ ఇన్నింగ్స్ ముగింపుకొచ్చింది.