ఐపీఎల్-14వ సీజన్‌ను అద్భుత విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నెల 6న సహచర పేసర్ రబాడతో కలిసి నోర్ట్జే భారత్‌కు వచ్చాడు. ఐతే క్వారంటైన్లో ఉండగా అన్రిచ్‌కు కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
మంగళవారం సాయంత్రం ముంబైలో ఏర్పాటు చేసిన టీమ్ ప్రాక్టీస్ సెషన్లో రబాడ పాల్గొనడంపై జట్టు ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో రబాడ చాలా సేపు మాతోనే ఉన్నాడని, అందరితోనూ బాగానే కలిసిపోయాడని ఢిల్లీ యువ ఆటగాడు ఒకరు వెల్లడించాడు. ‘మేమంతా ఒకరికొకరం హలో చెప్పుకున్నాం. అతను బాగానే ఉన్నాడు. రబాడకు కరోనా నెగెటివ్ వచ్చిందని మాకు తెలిసిందని’ ఆ ఆటగాడు పేర్కొన్నాడు. రబాడకు రెండు సార్లు నెగెటివ్ రావడంతో జట్టులోకి అనుమతించారు. ఐతే అంత త్వరగా అతన్ని ప్రాక్టీస్ సెషన్‌కు పంపించారనే ప్రశ్న తలెత్తుతోంది. నోర్ట్జే, రబాడ కలిసే భారత్‌కు రావడంతో పలువురు ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు.
Snapshots from the final hustle before the players step out to take on @rajasthanroyals 🔥#YehHaiNayiDilli #IPL2021 #VIVOIPL #RRvDC pic.twitter.com/xiPRBZp3NG
— Delhi Capitals (@DelhiCapitals) April 15, 2021
AG, OG, Lo G, Here comes KG 🔥
— Delhi Capitals (@DelhiCapitals) April 14, 2021
Drop a 💙 if you're excited for @KagisoRabada25's return 🤗
#YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/VJDo5EMyXD