Axar Patel | ఈ విజయం రోడ్డు ప్రమాద మృతులకు అంకితం.. ఆ ఇద్దరిని ఎప్పటికీ మర్చిపోం..!
Axar Patel : శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ అదిరే విక్టరీ కొట్టింది. అయితే.. ఈ విజయాన్ని తమ జట్టును ఎంతగానో అభిమానించే ఇద్దరు యువకులకు కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) అంకితమిచ్చాడు.
Axar Patel : పంతొమ్మిదో సీజన్లో నాలుగో విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 75కే ఆలౌట్ అవమానం నుంచి తేరుకున్న ఢిల్లీ.. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌పై అదిరే విక్టరీ కొట్టింది. అయితే.. ఈ విజయాన్ని తమ జట్టును ఎంతగానో అభిమానించే ఇద్దరు యువకులకు కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) అంకితమిచ్చాడు. విషాదకరమైన విషయం ఏంటంటే వారిద్దరు ఇప్పుడు ప్రాణాలతో లేరు.
రాజస్థాన్‌పై 6 వికెట్ల విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. 226 పరుగుల ఛేదనతో నాలుగో విజయం సాధించిన ఢిల్లీ.. ఈ విజయాన్ని రోడ్డు ప్రమాద మృతులకు అంకితమిస్తున్నట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ వెల్లడించాడు. జైపూర్‌లో మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడుతూ.. మా గత మ్యాచ్ అనంతరం మా జట్టు అభిమానులు ఇద్దరు చనిపోయారు. వారి మృతిపట్ల నేను సంతాపం తెలియజేస్తున్నా. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా. వారిద్దరు ఢీసీ కుటుంబంలో సభ్యులు. అందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికి లోనయ్యాడు.
You will be remembered in our every roar 💙❤️ pic.twitter.com/sn0UrOPe9S
— Delhi Capitals (@DelhiCapitals) May 2, 2026
ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 27న ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం యగ్యా భాటియా(20), అభవ్ భాటియా(14)లు బండిమీద ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో యగ్యా, అభవ్లు మృతి చెందారు. హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. వీరిద్దరి మృతి పట్ల ఢిల్లీ ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో విచారం వ్యక్తం చేసింది.
‘ఢిల్లీ టోలి ఫ్యాన్ గ్రూప్‌లో సభ్యులైన అభవ్, యగ్నా భాటియాలు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. వీరిద్దరు స్టాండ్స్‌లో ఢిల్లీకి మద్ధతుగా నిలిచేవారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబం, ప్రియమైన వాళ్లకు మద్దతుగా ఉంటాం. అభవ్, యగ్యా ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాం’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది.
𝗛𝗲𝗮𝗿𝘁𝗯𝗿𝗼𝗸𝗲𝗻. 𝗧𝗵𝗲𝗿𝗲 𝗮𝗿𝗲 𝗻𝗼 𝘄𝗼𝗿𝗱𝘀.
We mourn the tragic loss of Abhav (14) and Yagya Bhatia (20), members of the DC Toli.
They have been in the stands with us, cheering for Dilli. Today, we stand with their families and loved ones in this moment of… pic.twitter.com/Hp8iY3IXqL
— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2026
ఏప్రిల్ 27న మ్యాచ్ అనంతరం యగ్నా, అభవ్లు బండి మీద ఇంటికి వెళ్తుండగా.. ఒక ట్రక్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 10:30 గంటలకు పీసీఆర్ కాల్ రావడంతో వీరిని సమీపంలోని రామ్ మనోహర్ లోహియా అస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఇద్దరు మరణించినట్టు వైద్యులు తెలిపారు. యగ్యా బీఎస్సీ విద్యార్థి కాగా, అభవ్ పదో తరగతి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

