David Warner : బాక్సింగ్ డే రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న వార్నర్ ఈ మ్యాచ్‌లో 144 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది అతనికి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఓపెనర్‌గా 45వ సెంచరీ. దాంతో, అతను అరుదైన మైలురాయి అందుకున్నాడు. భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును వార్నర్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో సచిన్ అత్యధిక శతకాలు కొట్టిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. సెంచరీ తర్వాత కూడా జోరు కొనసాగించిన వార్నర్ 254 బందుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. అయితే.. ఆ వెంటనే కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.
వందో టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ రికార్డులు బద్ధలు కొట్టాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అతను సెంచరీ మార్క్ అందుకున్నాడు. అంతేకాదు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ తర్వాత వందో టెస్టులోడబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. అంతకుముందు వందో టెస్టులో శతకం బాదిన పదో ఆటగాడిగా అతను రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.