న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో హైడ్రామా చోటుచేసుకున్నది. గ్రాండ్ స్లామ్ ఫస్ట్ రౌండ్లోనే మాజీ చాంపియన్ డానియల్ మెద్వదేవ్(Daniil Medvedev) ఓటమి పాలయ్యాడు. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ ప్లేయర్ బెంజిమన్ బాంజీ విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ నాటకీయ పరిణమాం చోటుచేసుకున్నది. మూడవ సెట్లో మెద్వదేవ్ ఓడిపోతున్న సమయంలో.. ఓ ఫోటోగ్రాఫర్ గ్రౌండ్లోకి వచ్చాడు. దీంతో చైర్ అంపైర్ మరోసారి బాంజీకి ఫస్ట్ సర్వ్ చేసే అవకాశం ఇచ్చాడు. అప్పుడు 3-6, 5-7, 4-5 స్కోరుతో బాంజీ చాంపియన్‌షిప్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
INSANE scenes in the Medvedev & Bonzi match at US Open
A cameraman was trying to leave after Bonzi missed his 1st serve.
The umpire gave Bonzi a 1st serve.
Daniil: “Are you a man? Are you a man? why are you shaking? What’s wrong huh? Guys he wants to leave. He gets paid by… pic.twitter.com/nzlqgoWxre
— The Tennis Letter (@TheTennisLetter) August 25, 2025
ఫోటోగ్రాఫర్ అడ్డురావడంతో ఆ సమయంలో మెద్వదేవ్ మైదానంలో హంగామా చేశాడు. ప్రత్యర్థికి మళ్లీ ఫస్ట్ సర్వ్ ఇవ్వడాన్ని అడ్డగించాడు. ఆ తర్వాత తన అరుపులతో స్టేడియంలోని ప్రేక్షకుల్ని రెచ్చగొట్టాడు. కాసేపు ప్రేక్షకులు మెద్వదేవ్‌కు అనుకూలంగా అరిచారు. సుమారు ఆరున్నర నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఆ కీలకమైన మూడవ సెట్లో బ్రేక్ పాయింట్ సాధించిన మెద్వదేవ్ ఆ తర్వాత ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక నాలుగో సెట్లో రష్యన్ ప్లేయర్ దూకుడు ప్రదర్శించాడు. 0-6 స్కోరుతో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక్కసారి మ్యాచ్ ఉత్కంఠకు చేరింది. దాదాపు ఓటమి ఖాయనుకున్న దశలో మెద్వదేవ్.. వరుసగా రెండు సెట్లు కొట్టేసి .. మ్యాచ్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. అయితే చివరి సెట్లో మాత్రం ఫ్రెంచ్ ఆటగాడు బెంజిమన్ బాంజీ తన సత్తా చాటాడు. 6-4 స్కోరుతో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో మెద్వదేవ్ ఫస్ట్ రౌండ్లోనే యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఓడిన ఆవేశంలో మెద్వదేవ్ తన వద్ద ఉన్న రాకెట్లను విరగొట్టాడు. ప్లేయర్ల కుర్చీపై కూర్చుని తీవ్ర అసహనంతో రగిలిపోయాడు. రాకెట్‌ను నేలకేసి కొట్టాడు.
Daniil Medvedev smashed his racket after his first-round loss at the US Open. pic.twitter.com/HJtQAYcfHA
— ESPN (@espn) August 25, 2025