ఆర్సీబీకి గుడ్‌న్యూస్..జట్టుతో చేరిన ఆసీస్ ఆల్‌రౌండర్

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో శుభవార్త. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ చెన్నైలోని జట్టు బయో బబుల్‌లో చేరాడు. కొవిడ్-19 నేపథ్యంలో రెండుసార్లు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ నెగెటివ్ రావడంతో అతను జట్టుతో చేరినట్లు ఫ్రాంచైజీ శనివారం తెలిపింది. ఏప్రిల్ 7న సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నాడు.
ట్రేడింగ్ ద్వారా సామ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బెంగళూరు తీసుకుంది. ఆస్ట్రేలియా నుంచి ఏప్రిల్ 3న భారత్‌కు వచ్చినప్పుడు నిర్వహించిన టెస్టులో మొదట అతనికి నెగెటివ్ వచ్చింది. ఏప్రిల్ 7న ఆల్‌రౌండర్‌కు పాజిటివ్‌గా తేలింది. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం 10 రోజుల తప్పనిసరి ఐసోలేషన్ తర్వాత సామ్స్ జట్టులో చేరినట్లు ఫ్రాంఛైజీ పేర్కొంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
Daniel Sams is out of quarantine and has joined the RCB bio-bubble today with two consecutive negative reports for COVID-19.
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2021
RCB medical team was in constant touch with Sams and has declared him fit to join the team after adhering to all the BCCI protocols.#PlayBold #IPL2021 pic.twitter.com/0none9RQ7l
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

