టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన చెస్ టోర్నమెంట్లో ఓ విభిన్న ఘటన చోటుచేసుకున్నది. అమెరికా టీమ్ ప్లేయర్ హికారు నకమురా మ్యాచ్ గెలిచిన తర్వాత చెస్ వరల్డ్ చాంపియన్ డి గుకేశ్(D Gukesh)కు చెందిన కింగ్ పావును తీసుకుని జనంలోకి విసిరేశాడు. ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. గుకేశ్‌కు చెక్ పెట్టిన తర్వాత నకమురా ఆ ఆనందంలో ప్రత్యర్థి కింగ్ పావును తీసుకుని ప్రేక్షకుల్లోకి విసిరేశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ ఈ ఘటనను సోషల్ మీడియాలో ఖండించారు. అయితే మ్యాచ్ ముగిశాక కింగ్ పావును జనంలోకి విసిరేయాలని టోర్నీ నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఆ స్టంట్ చేసినట్లు చెబుతున్నారు. షో చేయడానికి అలా కింగ్ పావును విసిరేశామని, దీంట్లో అమర్యాదగా ప్రవర్తించినట్లు ఏమీ లేదని చెస్ నిపుణుడు లెవీ రోజ్‌మాన్ తెలిపారు. నకమురా కూడా తన యూట్యూబ్ ఛానల్లోఈ ఘటనపై స్పందించారు. చాన్నాళ్లుగా చెస్ ఆడుతున్నామని, సెలబ్రేషన్స్ దీనిలో భాగమే అని, చదరంగం ఆడడం అంటే అదో ఒంటరి జాబ్ లాంటిందని, భారతీయ ఆటగాళ్లు కూడా ఎంజాయ్ చేశారని నకమురా తెలిపారు.
That moment when @GMHikaru Nakamura turned around a lost position and checkmated World Champion Gukesh – picking up and throwing Gukesh’s king to the crowd, celebrating the 5-0 win of Team USA over Team India!
Video: @adityasurroy21 pic.twitter.com/GuIlkm0GIe
— ChessBase India (@ChessbaseIndia) October 5, 2025