Cummins ODI Team : మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబర్ 19 ఆదివారం జరగుబోయే తొలి మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా సాధన చేస్తోంది. స్వదేశంలో పంజా విసిరేందుకు ఆసీస్ సైన్యం కూడా పక్కాగా సిద్ధమవుతోంది. అయితే.. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవ్వడం తనకు బాధగా ఉందంటున్నాడు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins). రెండు దేశాల మధ్య ‘నువ్వానేనా’ అన్నట్టు సాగే క్రీడా సమరాన్ని తానెంతగానో మిస్ అవుతానని అటున్న ప్యాటీ.. ఇరుదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో గురువారం వన్డే తుది జట్టును ప్రకటించాడు.
భారత్, ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించన గొప్ప క్రికెటర్లు కమిన్స్ తుది జట్టులో ఉన్నారు. ఇరుదేశాల రిటైర్డ్ ఆటగాళ్లతో ప్రకటించిన ఈ జట్టులోకి టీమిండియా నుంచి ముగ్గురిని మాత్రమే తీసుకున్నాడతడు. మాజీ సారథి సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)కి మాత్రం అతడి టీమ్‌లో చోటు దక్కలేదు. ఇంతకూ.. ఈ వెటరన్ పేసర్ ఎంచుకున్న ఆ ముగ్గురు భారతీయలు ఎవరంటే.. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్‌ను తీసుకున్నాడు కమిన్స్.
Pat Cummins makes his all-time ODI 11 🇮🇳🇦🇺 pic.twitter.com/lKcAg3bUXf
— RVCJ Media (@RVCJ_FB) October 15, 2025
మిడిల్ ఆర్డర్ కోసం రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్లను ఎంచుకున్న ప్యాటీ.. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీకి ఓటేశాడు. బౌలింగ్ దళంలో అలనాటి ఆసీస్ త్రయం.. బ్రెట్ లీ, మెక్‌గ్రాత్, దివంగత షేన్ వార్న్‌లకు చోటు దక్కగా.. మూడో పేసర్‌గా భారత లెజెండ్ జహీర్ ఖాన్‌ను కమిన్స్ ఎంచుకున్నాడు. అయితే.. కెప్టెన్ ఎవరనేది మాత్రం ఆసీస్ స్టార్ వెల్లడించలేదు.
కమిన్స్ వన్డే జట్టు (రిటైర్డ్ క్రికెటర్లతో) : డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), బ్రెట్ లీ, షేన్ వార్న్, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రాత్.
Pat Cummins proved yet another time , his ball knowledge 🙂↕️👏👏👏
One of the GOAT player in this era 🙏 pic.twitter.com/4jOop8ohUl
— Supremist 💛🦚 (@CSKlaasen8467) October 15, 2025