Ashes Series : యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందే గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఫిట్నెస్ సాధించాడు. పెర్త్ టెస్టు(Perth Test)కు అందుబాటులో ఉండడని చెప్పిన ప్యాటీ సోమవారం నెట్స్‌లో చెమటోడ్చాడు. సహచరులతో కలిసి ఉత్సాహంగా బౌలింగ్ కూడా చేశాడు. దాంతో.. తొలి మ్యాచ్‌లో అతడు ఆడడం ఖాయమనిపిస్తోంది. ప్రధాన పేసర్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) గాయంతో సిరీస్ ఓపెనర్‌కు దూరమైనందున అనుభవజ్ఞుడైన కమిన్స్ ఆడేందుకు సిద్దమవుతున్నాడని సమాచారం.
సొంతగడ్డపై యాషెస్ సిరీస్ ప్రారంభానికి మరో నాలుగు రోజులే ఉంది. రికార్డులు ఘనంగానే ఉన్నా ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతున్నాయి. కమిన్స్ కోలుకున్నా.. పేసర్లు హేజిల్‌వుడ్, సీన్ అబాట్, రిచర్డ్సన్ గాయంతో అందుబాటులో లేరు. ఇక కుర్రాళ్లనే నమ్ముకోకతప్పని పరిస్థితి.
📽️ Pat Cummins continues working back to full fitness for Brisbane pic.twitter.com/dTcQtkD2Cj
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2025
అయితే.. ఇంగ్లండ్‌ను నిలువరించాలంటే బలమైన పేస్ దళం అవసరమైన వేళ కమిన్స్ జట్టుకోసం ‘నేనున్నా’ని అంటున్నాడు. పెర్త్ టెస్టు నవంబర్ 21న జరుగనున్నందున.. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆసీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడీ సారథి. మునపటిలా అతడు బౌలింగ్ చేయడంతో తొలి మ్యాచ్‌కు తాను సిద్ధమేనని ప్యాటీ చెప్పేశాడని కంగారూ క్రికెటర్లు అనుకుంటున్నారు. ఒకవేళ కమిన్స్ తుది జట్టులో ఉంటే స్టీవ్ స్మిత్ (Steve Smith) బదులు అతడే సారథ్య వహించడం పక్కా. హేజిల్‌వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్(Michael Neser)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు.
Pat Cummins is training with the Australian team for the Ashes series. 🏆💥
He is eyeing a return in the 2nd Test.#Cricket #Cummins #Ashes #Sportskeeda pic.twitter.com/OF17Wj9z6g
— Sportskeeda (@Sportskeeda) November 17, 2025