సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే కష్టాలు కలిగాయి. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) ఇద్దరూ అవుటయ్యారు. వాషింగ్టన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చిన ఊతప్ప అవుటయ్యాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో కొంత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే నాలుగో ఓవర్ తొలి బంతికే ఊతప్పు అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే గైక్వాడ్‌ను నటరాజన్ బౌల్డ్ చేశాడు.
ఆరో ఓవర్ తొలి బంతిని అంచనా వేయలేకపోయిన రుతురాజ్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బ్యాట్‌ను తప్పించుకున్న బంతి నేరుగా వెళ్లి వికెట్లను కూల్చింది. దాంతో రుతురాజ్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (27 నాటౌట్), మొయీన్ అలీ (34 నాటౌట్) రాణిస్తున్నారు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.