Matheesha Pathirana | ఐపీఎల్ ప్రదర్శనతో శ్రీలంక జట్టులోకి.. వన్డేల్లో ఆరంగ్రేటం చేయనున్న పథిరన
Matheesha Pathirana : ఐపీఎల్(IPL) అనేది ఎంటర్టైనింగ్ క్రికెట్ మాత్రమే కాదు కుర్రాళ్ల కలను నిజం చేసే వేదిక కూడా. ఈ టోర్నీలో అదరగొడితే చాలు జాతీయ జట్టులో ఆడే అవకాశం వెతుక్కుంటూ మరీ వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 16వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక క్రికెటర్ మథీశ పథిరన(Matheesha Pathirana) వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఈ యంగ్ పేసర్ ఈరోజు ఆఫ్గనిస్థాన్‌పై...
Matheesha Pathirana : ఐపీఎల్(IPL) అనేది ఎంటర్టైనింగ్ క్రికెట్ మాత్రమే కాదు కుర్రాళ్ల కలను నిజం చేసే వేదిక కూడా. ఈ టోర్నీలో అదరగొడితే చాలు జాతీయ జట్టులో ఆడే అవకాశం వెతుక్కుంటూ మరీ వస్తుంది. అవును.. సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్.. వీళ్లంతా టీమిండియాలోకి అలా వచ్చిన వాళ్లే.. ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ మథీశ పథిరన(Matheesha Pathirana) వంతు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 16వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన అతడు వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఈ యంగ్ పేసర్ ఈరోజు ఆఫ్గనిస్థాన్‌పై వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు.
పథిరన బౌలింగ్ యాక్షన్ అచ్చుగుద్దినట్టు తమదేశానికి చెందిన మాజీ పేసర్ లసిత్ మలింగ(Lasith Malinga) లెక్క ఉంటుంది. ఇరవై ఏళ్ల ఈ శ్రీలంక బౌలర్ ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేశాడు. 12 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన అతను కచ్చితమైన యార్కర్లు సంధించేవాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సలహాలతో అతను విజయవంతం అయ్యాడు. యంగ్స్టర్లు తుషార్ దేశ్‌పాండే, థీక్షణ(శ్రీలంక)తో కలిసి సీఎస్కే విజయాల్లో పథిరన కీలక పాత్ర పోషించాడు.
🎉🏏 Exciting moment for Matheesha Pathirana as he receives his One Day International cap from skipper Dasun Shanaka! 🙌#SLvAFG pic.twitter.com/2EaBAXYwzC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 2, 2023

జడ్డూ మ్యాజిక్.. చెన్నైకి ట్రోఫీ
చెన్నై జట్టు ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. దాంతో, ఐదో ఐపీఎల్ ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు అత్యధిక టైటిళ్లతో ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రవీంద్ర జడేజా(15 నాటౌట్) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. పరుగెత్తుతూ వెళ్లి డగౌట్లో ఉన్న కెప్టెన్ ఎంఎస్ ధోనీని కౌగిలించుకున్నాడు. ధోనీ అతడిని అమాంతం ఎత్తుకుని అభినందించాడు.
ఇవి కూడా చదవండి
Sachin Tendulkar | రూ.4 కోట్ల విలువైన లాంబోర్ఘిని కారు కొనుగోలు చేసిన సచిన్.. వీడియో వైరల్
MP Pritam Munde: బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

