MP Pritam Munde: బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్
MP Pritam Munde : మహిళలు ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. బ్రిజ్‌పై రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చేశారు. బ్రిజ్‌పై చర్యలు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
న్యూఢిల్లీ: బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఆ అంశంపై ప్రశ్నలు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే(MP Pritam Munde) మాత్రం స్పందించారు. ఎవరైనా మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ తర్వాత ఫిర్యాదు సరైందా కాదా అన్న కోణంలో విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. బీడ్ జిల్లాలో రిపోర్టర్లతో మాట్లాడిన ఆమె.. రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ ప్రీతమ్ ముండే అభిప్రాయపడ్డారు.
ఒక పార్లమెంట్ సభ్యురాలిగా కాకుండా, ఓ మహిళగా ఈ అభ్యర్థన చేస్తున్నానని, ఎవరైనా మహిళా అలాంటి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై సత్యాన్వేషణ చేపట్టాలని ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. ద్రువీకరణ తర్వాత ఆ ఫిర్యాదు సరైందా కాదా అని నిర్ధారించుకోవాలన్నారు. ఒకవేళ ఫిర్యాదును పట్టించుకోకుంటే, దాన్ని ప్రజాస్వామ్యంలో స్వాగతించలేమని ఆమె అన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో తాను భాగస్వామ్యురాలునే అయినప్పటికీ.. రెజ్లర్లతో ప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరపలేదని అంగీకరించాల్సి వస్తుందని ముండే తెలిపారు. భారీ ఎత్తున నిరసన జరుగుతున్నప్పుడు, దానిపై ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

