IPL 2025 : సొంత మైదానంలో చెలరేగి ఆడతారు ఎవరైనా. కానీ, ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు హోమ్ గ్రౌండ్ కలిసి రావడం లేదు. మరోసారి చెపాక్ స్టేడియంలో ఓపెనర్లు విఫలం అయ్యారు. మోయిన్ అలీ బౌలింగ్లో డెవాన్ కాన్వే(12) స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ కాసేపటికే హర్షిత్ రానా వేసిన షార్ట్ పిచ్ బంతికి రచిన్ రవీంద్ర(4) బోల్తా పడ్డాడు. 16 పరుగులకే 2 కీలక వికెట్లు పడిన దశలో విజయ్ శంకర్ (12), రాహుల్ త్రిపాఠి(3)లు ధాటిగా ఆడుతున్నారు. ఆరు ఓవర్లకు చెన్నై స్కోర్.. 31-2. ఈ సీజన్లో 6 ఓవర్లలో ఇదే రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.