MS Dhoni : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్. వచ్చే సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆడుతాడా? లేదా? అనే వార్తలకు ఎండ్‌కార్డ్ పడింది. ఫ్రాంచైజీ క్రికెట్లో రారాజుగా వెలుగొందుతున్న మహీ భాయ్ మరో సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు. శరీరం సహకరిస్తే మరో సీజన్ ఆడుతానని ఇదివరకే ప్రకటించిన ధోనీ.. మరోమారు పసుపు జెర్సీతో స్టేడియాలను దద్దరిల్లేలా చేయనున్నాడు. అవును.. ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని క్రిక్‌బజ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ పంచుకున్నాడు. మీరు విన్నది నిజమే. ఐపీఎల్ 19వ సీజన్లో ధోనీ ఆడుతున్నాడు అని ఆయన తెలిపాడు.
భారత కెప్టెన్‌గానే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన ఆటతో అభిమానుల గుండెల్లో నిలిచిన ధోనీ.. వీడ్కోలు వార్తలకు చెక్ పెట్టాడు. మరో సీజన్‌కు నేను రెఢీ అంటూ తనపై కొండంత ప్రేమ కురిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK), సీఎస్కే ఫ్యాన్స్‌ను సంబురాల్లో ముంచెత్తాడీ వెటరన్. శుక్రవారం ‘క్రిక్‌బజ్’తో మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Viswanathan) అమితానందంతో ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు.
🚨Cricbuzz can confirm that MS Dhoni will play IPL 2026
“MS has told us that he will be available for the next season” CSK CEO Kasi Viswanathan told Cricbuzz#IndianCricket #CricketTwitter pic.twitter.com/whGtdaeEKq
— Cricbuzz (@cricbuzz) November 7, 2025
‘వచ్చే సీజన్లో ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ధోనీ మాతో చెప్పాడు. అతడి నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అనుభవజ్ఞుడైన ధోనీ యువతరానికి మార్గనిర్దేశనం చేయడంలో కీలకం కానున్నాడు’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సంజూ శాంసన్ (Sanju Samson)ను రాజస్థాన్ రాయల్స్ నుంచి కొనడంపై గురించి చర్చలు జరుగుతున్నాయని విశ్వనాథన్ తెలిపాడు. నవంబర్ 10, 11వ తేదీల్లో సీఎస్కే యాజమాన్యం, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో ధోనీ సమావేశం అవుతాడని సమాచారం. సీఎస్కే భవిష్యత్ గురించి.. వేలంలో కొనాల్సిన ఆటగాళ్ల గురించి చర్చించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పద్దెనిమిదో ఎడిషన్ ముందు కెప్టెన్సీ వదులుకున్న ధోనీ.. సీజన్ మధ్యలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎడమచేతి బొటనవేలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో, మళ్లీ సీఎస్కే సారథ్యాన్ని చేపట్టిన తాల.. కుర్రాళ్లో ఆత్మవిశ్వాసం నింపుతూ జట్టులో స్ఫూర్తి రగిలించాడు. ఈ సీజన్లో ఫినిషర్‌గానూ రాణించిన ధోనీ.. 13 ఇన్నింగ్స్‌ల్లో 196 రన్స్ కొట్టాడు. ఇప్పటివరకూ ఎల్లో జెర్సీతో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 4,865 పరుగులు సాధించాడు. ఏకంగా ఐదు పర్యాయాలు (2010, 2011, 2018, 2021, 2023) సీఎస్కేను ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
🚨 IPL 2026 Buzz 🚨
Big moves ahead for Chennai Super Kings! 💛– MS Dhoni confirmed to return for next season, locked & loaded for IPL 2026.
– CSK & RR reportedly in talks over a potential Sanju Samson trade, says [Cricbuzz]. 🔥If both happen — it’s going to be a blockbuster… pic.twitter.com/NfvlrsuVmR
— Yamika (@Yamika_X) November 7, 2025