
కొత్తపల్లి: కరీంనగర్లో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ టోర్నీలో సిద్దిపేట ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ కంట్రీ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్లేయర్లు పోటీపడ్డారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా జట్టు ఓవరాల్ విజేతగా నిలిచింది. పురుషుల 10కి.మీల రేసులో నాగర్‌కర్నూల్ జట్టు, మహిళల విభాగంలో సిద్దిపేట టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. అండర్-20 బాలుర విభాగం 8కి.మీల పోటీలో సిద్దిపేట, బాలికల 6కి.మీల రేసులో జగిత్యాల ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగాలాండ్‌లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షించారు. కరీంనగర్లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తే తాను పూర్తి సహాయ, సహకారాలు
అందిస్తామన్నారు.