హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కప్ టోర్నీలో మండల స్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. పండుగ వాతావరణంలో మూడు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోటీల్లో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టోర్నీలు సందడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 618 మండల్లాల్లో ఐదు క్రీడాంశాల్లో (అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్) పోటీలు జరిగాయి.
ఇందులోని నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మండల స్థాయి పోటీలు విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ నెల 22 నుంచి 24 వరకు జిల్లా కేంద్రాల్లో జరిగే సీఎం కప్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు భాగం కానున్నారు.