Coco Gauff | అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ (Coco Gauff) యూఎస్ ఓపెన్ (US Open) గ్రాండ్‌స్లామ్ టోర్నీ గెలిచిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన ప్రపంచ రెండో సీడ్ అరీనా సబలెంకా (Aryna Sabalenka)ను ఓడించి 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను (US Open champion) కైవసం చేసుకుంది. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అరీనా సబలెంకాను 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన యూఎస్ ఓపెన్ ఫొటో సెషన్ ఈవెంట్లో కోకో గాఫ్ బార్బీ లుక్‌తో అదరగొట్టింది.
పింక్ జాకెట్, ప్యాంట్‌తో పాటు వైట్ స్నీకర్స్ ధరించిన కోకో గాఫ్ అదిరిపోయే కలర్ కాంబినేషన్ ఔట్ఫిట్తో తళుక్కున మెరిసింది. బార్బీ లుక్‌లో మరింత అందంగా కనిపించింది. ఇక ఈ ఫొటోలను కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ స్పెషల్‌గా తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది. దీనికి బార్బీ డ్రీమ్స్ (barbie dreams) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
barbie dreams 💞💁🏾♀️🏆 pic.twitter.com/N2yCuvgJI6
— Coco Gauff (@CocoGauff) September 10, 2023
🏆 with the belt goes hard pic.twitter.com/IAi4d5DhTu
— Coco Gauff (@CocoGauff) September 10, 2023
ఇక సొంతగడ్డపై జరిగిన యూఎస్ ఓపెన్‌లో కోకో గాఫ్ (Coco Gauff) దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 19 ఏండ్ల గాఫ్ 2-6, 6-3, 6-2తో అరియానా సబలెంకను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగడానికి పది నిమిషాల ముందు వరకు సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉన్న ఈ టీనేజర్.. ట్రోఫీ నెగ్గిన అనంతరం వివర్శకులు, ట్రోలర్స్‌కు ఇదే తన జవాబని గద్గద స్వరంతో ప్రకటించింది. అమెరికా దిగ్గజ ప్లేయర్లు సెరెనా, వీనస్ ఆట చూసేందుకు గతంలో పలుమార్లు యూఎస్ ఓపెన్ మైదానాలకు వచ్చిన గాఫ్.. ఇప్పుడు అదే స్టేడియంలో విజయనాదం చేసింది. తొలి సెట్లో పరాజయం పాలైన గాఫ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.
Concrete jungle where dreams are made of…… @usopen pic.twitter.com/Zgx3mRAFkc
— Coco Gauff (@CocoGauff) September 10, 2023
రెండు గంటలకు పైగా సాగిన సమరంలో 5 బ్రేక్ పాయింట్లు సాధించిన గాఫ్ 13 విన్నర్స్ కొట్టింది. మరోవైపు 4 ఏస్‌లు బాదిన సబలెంక.. 46 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం గాఫ్ మాట్లాడుతూ.. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఇది నాకోసం సాధించింది. గతంలో దగ్గరి వరకు వచ్చి ఓడిపోవడంతో చాలా నిరాశ చెందా. ఇప్పుడు స్వప్నం సాకారమైనట్లు అయింది’ అని పేర్కొంది. సెరెనా విలియమ్స్ (1999) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా టీనేజర్‌గా గాఫ్ రికార్డుల్లోకెక్కింది.