నిఖత్ జరీన్‌కు అర్జున అవార్డు.. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Nikhat Zareen | అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ
హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బాక్సింగ్‌లో వరుస విజయాలను నమోదు చేస్తూ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలు అని పేర్కొన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. ఆమె ప్రతిభను గుర్తించిన అవార్డుల కమిటీ నిఖత్‌కు అర్జున అవార్డు ప్రకటించింది. ఈ నెల 30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిఖత్ అర్జున అవార్డు అందుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

