మాసన్ : గాయంనుంచి కోలుకుని బరిలోకి దిగిన 152వ ర్యాంకర్ బోర్నా కొరిక్ అనూహ్య రీతిలో 7-6(0), 6-2 స్కోరుతో నాలుగో సీడ్ స్టెఫనాస్ సిట్సిపాస్‌పై గెలుపొంది సిన్సినాటి ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. గత యేడాది కుడి భుజానికి గాయమై శస్త్రచికిత్సతో ఎనిమిది నెలల తరువాత తిరిగి రాకెట్ చేపట్టిన కొరిక్ ఈ టైటిల్‌తో తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని దక్కించుకున్నాడు. అంతేగాక తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 123 ర్యాంకులు మెరుగై 29వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు.
యుఎస్ ఓపెన్లోకూడా సీడెడ్ ఆటగాడిగా పోరులోకి దిగనున్నాడు. సెమీస్‌లో టాప్ ర్యాంకర్ మెద్వెదెవ్పై విజయంతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సిట్సిపాస్ ఆరంభంలోనే బ్రేక్ సాధించి తొలి సెట్లో 4-1 ఆధ్యిం సాధించాడు. అయితే కొరిక్ పుంజుకుని వ్యత్యాసాన్ని 3-4కు తగ్గించి సెట్‌ను టైబ్రేక్‌కు చేర్చాడు. అయితే టైబ్రేక్ ఆరంభలోనే సిట్సిపాస్ డబుల్ఫాల్ట్తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడంతో కొరిక్ ఒక్క పాయింట్‌కూడా వదలకుండా టైబ్రేక్‌ను సొంతం చేసుకునానడు. రెండో సెట్లో కొరిక్ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అయితే సిట్సిపాస్ మరోసారి డబుల్ఫాల్టతో కొరిక్కు ఆధిక్యం ఇవ్వడంతో దానిని సద్వినియోగం చేసుకుంటూ సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
క్వాలిఫయర్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రెంచ్ క్రీడాకారిణి కరోలినా గార్సియా డబ్ల్యుటిఏ టోర్నీ టైటిల్ గెలుచుకున్న తొలి క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించింది. ఫైనల్ చేరే క్రమంలో గార్సియా టాప్ టెన్‌లోని మరియా సక్కారి, అరినా సబలెంకా, జెస్సికా పెగ్యులాలను ఓడించి తన విజయం గాలివాటం కాదని నిరూపించింది. ఫైనల్లో తన ప్రధానాయుధం ఏస్‌లను మరోసారి సమర్ధంగా ప్రయోగించి 6-2, 6-4తో క్విటోవాను మట్టికరపించింది. ఈ మ్యాచ్‌లో గార్సియా 11 ఏస్‌లను సంధించడమేగాక తాను ఎదుర్కొన్న 8 బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. గార్సియా ఈ సీజన్లో గెలిచిన మూడో టైటిల్ ఇది.