CJI Sanjeev Khanna | ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా క్రీడలకు సంబంధించిన ఓ కేసు విచారణ నుంచి స్వయంగా తప్పుకున్నారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ), ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాలకు సంబంధించిన విచారణను ఆయన విరమించుకున్నారు. తాను ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తుండగా వాటి విచారణ గురించి తెలుసునని, అందుకే ఈ విచారణను జస్టిస్ పీఎస్ నరసింహకు అప్పగిస్తూ ఆయన తప్పుకుంటున్నట్టు తెలిపారు
18 ఏండ్ల తర్వాత పాక్‌కు
కరాచీ: 18 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో టెస్టులు ఆడేందుకు ఆ దేశానికి విచ్చేసింది. పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు గాను కరీబియన్ జట్టు సోమవారం ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. 2006 తర్వాత పాక్‌కు రావడం విండీస్‌కు ఇదే తొలిసారి. ముల్తాన్ వేదికగా ఈనెల 17న తొలి టెస్టు, 25న ఇదే వేదికపై రెండో టెస్టు జరుగనుంది.