సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. జింఖానా మైదానం వేదికగా కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పోటీలు జరిగాయి. మహిళల అండర్-18 బాస్కెట్‌బాల్ విభాగంలో కేవీబీఆర్ విజేతగా నిలువగా, వాలీబాల్, త్రోబాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ విభాగాల్లో సెయింట్ ఫ్రాన్సిస్ ట్రోఫీలు దక్కించుకుంది.
యూత్ మెన్ విభాగంలో మొహమ్మద్ స్పోర్టింగ్ క్లబ్(హాకీ), కేవీబీఆర్ స్టేడియం(బాస్కెట్‌బాల్), ఎమ్ఎల్ఆర్ఐటీ(హ్యాండ్‌బాల్)విజేతలుగా నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ వాణిదేవి, టీఎస్ఈడబ్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘స్వాతంత్య్ర స్ఫూర్తిని నలుదిశలా వ్యాపించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. క్రీడలు, ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వ మెండైన ప్రోత్సాహం అందిస్తున్నది’ అని అన్నారు.