Chris Gayle | మీరు ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ ఎవరు?.. అతనింకా పుట్టలేదు.. వెస్టిండీస్ దిగ్గజం రిప్లయ్
మీరు ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ ఎవరు? అనే ప్రశ్నకు విండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ అతనింకా పుట్టలేదని, తనకు బౌలింగ్ చేసే బెస్ట్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. రోహిత్ శర్మ తన ఫేవరెట్ బ్యాటర్ అని తెలిపాడు.
Chris Gayle : క్రికెట్లో.. ఫార్మాట్ ఏదైనా సరే విధ్యంసక ఓపెనర్ ఎవరంటే..? వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ గుర్తుకొస్తాడు. బౌలర్ ఎవరైనా సరే తొలి బంతి నుంచే విరుచుకుపడే అతను ఈ శతాబ్దపు గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కెరీర్ ఆసాంతం ధనాధన్ ఇన్సింగ్స్‌లు, కళ్లు చెదిరే సిక్సర్లతో అభిమానులను ఫిదా చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనదైన స్ట్రోక్ ప్లేతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పతో హోమ్ ఆఫ్ హీరోస్ ఎపిసోడ్లో క్రిస్‌గేల్ మాట్లాడాడు. తన క్రికెటింగ్ జర్నీ, ఐపీఎల్, ప్రస్తుత క్రికెటర్లలో తన ఫేవరెట్ ఆటగాడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అవేంటంటే..?
మీరు ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ ఎవరు? అనే ప్రశ్నకు క్రిస్ గేల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘అతనింకా పుట్టలేదు. ప్రతి బౌలర్ గొప్పవాడే. అయితే.. నేను విరుచుకుపడిన వాళ్లలో చాలామంది ఉత్తమ బౌలర్లతో పాటు మంచి బౌలర్లు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు బెస్ట్ అని చెప్పడం చాలా కష్టం. నాకు బౌలింగ్ చేసే బెస్ట్ బౌలర్ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నా’ అని ఈ యూనివర్సల్ బాస్ బదులిచ్చాడు. అంతేకాదు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ బ్యాటర్ అని, అతను ఆడుతుంటే చూసేందుకు ఇష్టపడతానని గిల్ అన్నాడు.
ఆర్సీబీ ఫ్యాన్స్ బెస్ట్ ఫ్యాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్ బెస్ట్ ఫ్యాన్స్ అని గేల్ చెప్పాడు. ‘చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే అక్కడి అభిమానులు అర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ అని పెద్దగా అరుస్తూ మద్దతు తెలుపుతార, ఐపీఎల్లో వాళ్లే బెస్ట్ ఫ్యాన్స్’ అని అతను తెలిపాడు. అంతేకాదు తాను సిక్సర్ బాదిన బంతి ముక్కుకు తగిలి గాయపడిన యంగ్ ఫ్యాన్‌ను ఈ సందర్భంగా గేల్ గుర్తు చేసుకున్నాడు.
బాధ పడకు.. మరిన్ని సిక్స్‌లు కొట్టు
‘నేను సిక్స్ కొట్టిన బంతి స్టాండ్స్‌లోని ఒక అమ్మాయికి తగిలింది. మ్యాచ్ అనంతరం వెంటనే ఆమెను చూసేందుకు హాస్పిటల్ వెళ్లాను. ముక్కు నుంచి రక్తం కారుతూనే ఉంది. ఆమె దుస్తులకు రక్తం అంటింది. అయినా కూడా.. తను నాతో.. ఎందుకు బాధపడుతున్నావు? దిగులు పడకు. మరిన్ని సిక్స్‌లు కొట్టు అని చెప్పింది. నొప్పితో ఉన్నా కూడా ఆమె నాతో అలా చెప్పడం నన్ను కదిలించింది. ఆ తర్వాతి గేమ్ నుంచి ప్రతి అభిమాని ప్లీజ్.. నా ముక్కు పగలగొట్టు అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించేవాళ్లు. దాంతో నేను వాళ్లను ఆస్పత్రిలో కలుస్తానని వాళ్ల ఆలోచన’ అని గేల్ వెల్లడించాడు. 2011 నుంచి 2017 వరకు ఈ విండీస్ మాజీ ఓపెనర్ ఆర్బీబీ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో రికార్డు స్థాయిలో 7 శతకాలు బాదాడు. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (175) నమోదు చేశాడు.
🗣: 𝐑𝐂𝐁, 𝐑𝐂𝐁, 𝐑𝐂𝐁….@henrygayle believes @RCBTweets fans are the most passionate fans in the world 📣
Catch him along with @robbieuthappa in #HomeOfHeroes 🏏
Streaming on #JioCinema 🎥 pic.twitter.com/8D3GJ201mP
— JioCinema (@JioCinema) February 3, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

