క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ క్రెయిన్స్ ఆరోగ్యంపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఇప్పటికే పలుమార్లు గుండెకు శస్త్రచికిత్సలు చేయించుకోవడంతో పాటు పక్షవాతం బారిన పడిన క్రెయిన్స్కు తాజాగా క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని 51 ఏండ్ల క్రెయిన్స్ శనివారం ఒక ప్రకటనలో ధృవీకరించాడు. ప్రస్తుతం యూన్సివరిటీ ఆఫ్ కాన్బెర్రా దవాఖానలో పునరావాసం పొందుతున్న క్రెయిన్స్..సోషల్‌మీడియాలో స్పందిస్తూ ‘మరో పోరాటానికి సిద్ధమయ్యాను. పేగు క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసి షాక్‌కు గురయ్యాను. ఏదైతే జరుగవద్దు అనుకున్నానో అదే జరిగింది. దీనిపై వైద్యులు, నిపుణులతో మరోమారు చర్చించాల్సి ఉంది. ఇంకా ఇలా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నాడు.