టిరాన(అల్బేనియా): భారత యువ రెజ్లర్ చిరాగ్ చిక్కర అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పసిడితో సత్తాచాటాడు. టిరానలో జరిగిన ఈ టోర్నీ పురుషుల 57 కిలోల విభాగంలో చిరాగ్.. 4-3తో అబ్దిమాలిక్ ఖరచోవ్ (కిర్గిస్థాన్)ను ఓడించి చాంపియన్గా అవతరించాడు.
భారత్ తరఫున అండర్-23 చాంపియన్గా నిలిచిన రెజ్లర్లలో అమన్ సెహ్రావత్ (2022), రీతికా హుడా (2023) తర్వాత చిరాగ్ మూడోవాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తంగా 9 పతకాలు సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్లో అంజ్లి రజతం సాధించగా పురుషుల ఫ్రీస్టయిల్లో అభిషేక్, సుజీత్, విక్కీ కాంస్యాలు నెగ్గారు. మహిళల ప్రీస్టయిల్లో నేహా, శిక్ష, మోనిక కంచు మోత మోగించగా గ్రీకో రోమన్లో విశ్వజీత్ సైతం కాంస్య పతకం గెలిచాడు.