న్యూఢిల్లీ: టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి అఫీషియల్ సీఎస్కే జెర్సీని అందుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ధోనీ భాయ్ నుంచి అఫీషియల్ కిట్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పుజారా పేర్కొన్నాడు.
2014లో చివరిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పుజారాను ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో చెన్నై అతన్ని రూ.50లక్షలకు దక్కించుకుంది. గతేడాది పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్ కూడా చేరని చెన్నై ఈ ఏడాది ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. ధోనీసేన సీజన్ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.కొత్త జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు కూడా మహీ జెర్సీలు అందజేశాడు.
Putting our paws together in welcoming freshers into the #SuperFam! #WhistlePodu #Yellove 🦁 💛 pic.twitter.com/Noym2hbFB1
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 7, 2021