Arjun Erigaisi | న్యూఢిల్లీ: న్యూయార్క్ వేదికగా జరిగే వరల్డ్ ర్యాపిడ్, బ్లిజ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడేందుకు తనకు వీసా మంజూరు చేయాలని యూఎస్ ఎంబసీని భారత యువ జీఎం ఇరిగేసి అర్జున్ కోరాడు. వారం రోజుల వ్యవధిలో మొదలయ్యే మెగాటోర్నీ కోసం వీసా ఇవ్వాల్సిందిగా ఎక్స్‌లో అభ్యర్థించాడు.
దీనికి తోడు వీసా జారీ విషయంలో తనకు మద్దతుగా నిలువాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, క్రీడా మంత్రి మన్సుక్ మాండవీయా, ఆల్ఇండియా చెస్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్)ను అర్జున్ కోరాడు. ఆరు రోజుల పాటు జరిగే టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు ఫాబియానో కరువన, ఇయాన్ నెపోమియాచి, బోరిస్ గెల్ఫాండ్ బరిలో ఉన్నారు.