కోల్‌కతా: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో సీఎస్కే 49 రన్స్ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో చెన్నై టాప్‌లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 235/4 భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో కింగ్స్‌కు ఇది అత్యుత్తమం. చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. కోల్‌కతా బౌలర్లను చీల్చిచెండాడుతూ రహానే(29 బంతుల్లో 71 నాటౌట్, 6ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే(40 బంతుల్లో 56, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శివమ్ దూబే(21 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో వీరవిహారం చేశారు. ముఖ్యంగా రహానే కోల్‌కతాలో వీరంగం చేశాడు. గైక్వాడ్(35) ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే.. కాన్వే జతగా తన దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు శివమ్ దూబే..రహానేకు పోటీ అన్నట్లు 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఆఖర్లో జడేజా కూడా బ్యాటు ఝుళిపించడంతో చెన్నై 235 పరుగులు అందుకుంది. కుల్వంత్(2/44) ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనలో జాసన్ రాయ్(61), రింకూసింగ్(53 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా, మిగతావారు విఫలమయ్యారు. తుషార్ దేశ్‌పాండే(2/43), తీక్షణ(2/32) రాణించారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
చెన్నై: 20 ఓవర్లలో 235/4(రహానే 71 నాటౌట్, కాన్వే 56, కుల్వంత్ 2/44, సుయాశ్ 1/29), కోల్‌కతా: 20 ఓవర్లలో 186/8(రాయ్ 61, రింకూసింగ్ 53 నాటౌట్, తీక్షణ 2/32, దేశ్‌పాండే 2/43)
