చెన్నై : ఐపీఎల్-18లో ఘోరంగా విఫలమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరుపై ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదంటున్నాడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్లకు గాను ఆరింట్లో ఓడిన చెన్నై రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే. ఈ నేపథ్యంలో విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో మేం ఆశించినస్థాయిలో రాణించలేకపోయాం. రాబోయే మ్యాచ్లలో మేం మెరుగ్గా రాణిస్తాం. వరుసగా మ్యాచ్లు ఓడిపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఇది జస్ట్ ఒక గేమ్’ అని అన్నాడు.