Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్ రెండో బంతికి కేన్ విలియమ్సన్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విలియమ్సన్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు.. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర జోడి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. 57 పరుగుల వద్ద స్పిన్నర్ వరుణ్ బౌలింగ్‌లో విల్ యంగ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో 69 పరుగుల స్కోరు వద్ద న్యూజిలాండ్‌కు రెండో దెబ్బ తగిలింది.
రోహిత్ 11వ ఓవర్లో కుల్దీప్ను బౌలింగ్‌కు దించాడు. తాను వేసిన తొలి బంతికే రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. రచిన్‌కు రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రచిన్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 13 ఓవర్లో 75 పరుగుల స్కోరు వద్ద న్యూజిలాండ్‌కు మూడో దెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్.. కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 13 ఓవర్ల తర్వాత, న్యూజిలాండ్ స్కోరు మూడు వికెట్లకు 77 పరుగులు చేసింది. ప్రస్తుతం డారిల్ మిచేల్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.