సుజుక: స్టార్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాది ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేస్‌ను గెలుచుకోవడం ద్వారా.. ఈ రెడ్‌బుల్ రేసర్ ప్రపంచ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వెర్స్టాపెన్ మరో నాలుగు రేసులు మిగిలుండగానే టైటిల్ చేజిక్కించుకోవడం విశేషం. డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో వెర్స్టాపెన్ 366 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సమీప ప్రత్యర్థి పెరెజ్ (253 పాయింట్లు) అతడికి చాలా దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో 18 రేస్‌లలో వెర్‌స్టాపెన్‌కు ఇది 12వ విజయం కావడం విశేషం.