RR vs KKR | అర్ధ శతకం చేజార్చుకున్న వైభవ్.. రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన మిస్టరీ స్పిన్నర్..!
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో విధ్వంసక ఆటకు కేరాఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ(46) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..109-3
RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో విధ్వంసక ఆటకు కేరాఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ(46) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేస్తూ శుభారంభమిచ్చిన ఈ చిచ్చరపిడిగును వరుణ్ చక్రవర్తి(2-9) పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే ధ్రువ్ జురెల్(5), క్రీజులో కుదురుకున్న యశస్వీ జైస్వాల్(39) సైతం ఔటవ్వగా రాజస్థాన్ ఒత్తిడిలో పడింది.
ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ(46) కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను భయపెట్టాడు. మరో ఎండ్‌లో యశస్వీ జైస్వాల్(39) సైతం దంచేయగా.. పవర్ ప్లేలో అజేయంగా 63 పరుగులు చేసింది రాజస్థాన్. ఆ ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని 9వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి(2-9) విడదీసి కోల్‌కతాకు బ్రేకిచ్చాడు.
WICKET x 2️⃣!
🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️
Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv
— IndianPremierLeague (@IPL) April 19, 2026
అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగు భారీ షాట్ ఆడి రమన్‌దీప్ చేతికి చిక్కాడు. కాసేపటికే ధ్రువ్ జురెల్(5) అతడి ఓవర్లోనే స్టంపౌటయ్యాడు. వరసగా రెండు వికెట్లు పడడంతో షాక్‌లో ఉన్న రాజస్థాన్‌ను సునీల్ నరైన్(1-20) సైతం దెబ్బ తీశాడు. ఫామ్‌లో ఉన్న అతడి ఓవర్లో ఆఫ్ సైడ్ షాట్ ఆడి రహానే సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో, చూస్తుండగానే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రియన్ పరాగ్(7), హిట్మైర్(5)లు క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..109-3
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

