ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించింది. సిరాజ్ వేసిన 3వ ఓవర్లో డుప్లెసిస్ సిక్స్, గైక్వాడ్ ఫోర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లలోనూ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. దీంతో పవర్ ప్లే ఆఖరికి చెన్నై 51/0తో నిలిచింది. చాహల్ వేసిన 10వ ఓవర్లో గైక్వాడ్(33) ఔటైనా చెన్నై జోరు తగ్గించలేదు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో డుప్లెసిస్ భారీ షాట్లతో విజృంభించాడు. 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. డుప్లెసిస్(42), సురేశ్ రైనా(11) క్రీజులో ఉన్నారు.