బెంగళూరు : దేశవాళీ క్రికెట్ ఆరంభ సీజన్ దులీప్ ట్రోఫీలో తొలి రోజే భారీ స్కోర్లు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో క్వార్టర్స్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ డానిష్ మాలేవర్ (219 బంతుల్లో 198 నాటౌట్, 35 ఫోర్లు, 1 సిక్స్) ద్విశతకానికి రెండు పరుగుల దూరంలో ఉండగా కెప్టెన్ రజత్ పాటిదార్ (96 బంతుల్లో 125, 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
దీంతో 77 ఓవర్లలోనే 432/2 భారీ స్కోరు చేసింది. మరో మ్యాచ్‌లో నార్త్ జోన్.. 75.2 ఓవర్లలో 308/6 రన్స్ చేసింది.