Pankaj Advani | ముంబై: భారత దిగ్గజ క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. సీసీఐ బిలియర్డ్స్ క్లాసిక్ టోర్నీలో పంకజ్ వరుసగా మూడోసారి విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ 5-2తో ధృవ్ సిత్వాలపై అద్భుత విజయం సాధించాడు.
తుది పోరులో ఆదిలో తడబడ్డ అద్వానీ.. ఆ తర్వాత పుంజుకుని పోటీలోకి వచ్చాడు. స్కోరు 2-2తో సమమైన సమయంలో వరుసగా మూడు ఫ్రేమ్లు గెలిచిన ఈ స్టార్ క్యూయిస్టు టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.