రోమ్ : ఇటాలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగాల్లో కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), జాస్మిన్ పవులోని (ఇటలీ) టైటిల్స్ గెలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్.. 7-6 (7/5), 6-1తో యానిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ జాస్మిన్ పవులోని.. 6-4, 6-2తో కోకో గాఫ్ (అమెరికా)ను చిత్తు చేసి టైటిల్ దక్కించుకుంది.