IPL 2023: ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్‌లో సత్తా చాటింది. సొంత గడ్డపై విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. తొలి సీజన్ ఆడుతున్న విధ్వసంక ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (100 నాటౌట్ : 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు)సెంచరీతో ముంబైని గెలిపించాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(25 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో మూడోసారి రెండొందల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. 16 పాయింట్లతో నాలుగో బెర్తుకు పోటీ పడుతోంది. అయితే.. ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఫలితంపై ముంబై అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈసారి ఏమంత ఆకట్టుకోని హైదరాబాద్ ఓటమితో 16వ సీజన్‌ను ముగించింది.
అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో ముంబై అదరగొట్టింది. చావోరేవో లాంటి పోరులో సమిష్టిగా రాణించింది. తొలి సీజన్ ఆడుతున్న ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(100 నాటౌట్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), రోహిత్ శర్మ(56) దంచి కొట్టాడు. కోట్లు పెట్టి కొన్నందుకు ముంబైని కీలక పోరులో గట్టెంకించాడు. భారీ టార్గెట్ ఛేదనలో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) తక్కువకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్(73), రోహిత్ శర్మ(56) హైదరాబాద్ బౌలర్లపై విరుచకుపడ్డారు. వీళ్లు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(25 నాటౌట్)తో కలిసి గ్రీన్ లాంఛనం పూర్తి చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు.
𝙂𝙡𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙂𝙧𝙚𝙚𝙣!
How good was that knock in the chase 🙌
Relive that 💯 moment here 🔽 #TATAIPL | #MIvSRH pic.twitter.com/ZugNklUFKI
— IndianPremierLeague (@IPL) May 21, 2023
ఐపీఎల్ 16వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. దాంతో ఉన్న ముంబై ఇండియన్స్‌పై మరక్రం సేన 5 వికెట్ల నష్టానికి రెండొందలు స్కోర్ చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(83 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) వివ్రాంత్ శర్మ(69 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌలర్లపై విరుచుకుపడ్డారు. మయాంక్ అయితే సిక్సర్లతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. ఓపెనర్ల జోరు 140 వద్ద వివ్రాంత్ శర్మ వికెట్ తీసి ఆకాశ్ మధ్వాల్ ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే గ్లెన్ ఫిలిఫ్స్(1) ఔటయ్యారు. ఆకాశ్ మధ్వాల్ తన ఆఖరి ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ (18), హ్యారీ బ్రూక్(0)ను బౌల్డ్ చేశాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 20వ ఓవర్లో మరక్రం(13 నాటౌట్) తొలి బంతికి రెండు రన్స్ తీశాడు. మూడో బంతికి సన్వీర్ సింగ్(4 నాటౌట్) బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి మరక్రం సిక్స్ కొట్టాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4, జోర్డాన్ ఒక వికెట్ తీశారు.