Eyes Health In Winter | మన శరీరంలో అనేక అవయవాలలో కళ్లు కూడా ఒకటి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ కాలంలో కళ్లను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కాలంలో సెలవుల కారణంగా అలాగే వారు చేసే పనుల రీత్యా చాలా మంది బయట ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దీంతో సూర్య కిరణాలు కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో కళ్లు పొడిబారడం, కళ్లల్లో మంట, దురద వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే బలమైన సూర్యకిరణాల కారణంగా కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఈ కాలంలో కళ్ల ఆరోగ్యం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు ఈ కాలంలో కళ్ల ఆరోగ్యం, చూపు దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఈ సీజన్లో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరాలను వెల్లడిస్తున్నారు.
ఉసిరికాయ.. దీనిని ఆమ్లా, ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కంటికి కలిగే నష్టాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా ఉసిరికాయలను తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. కంటిశుక్లాలు కూడా నిరోధించబడతాయి. క్యారెట్ లలో బీటాకెరోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా అవసరం. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. కంటి ఇన్పెక్షన్ లు, కంటిశుక్లాలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. వేసవికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
పాలకూరలు, తోటకూర, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆకుకూరలను తీసుకోవడం వల్ల వృద్దుల్లో వచ్చే అంధత్వం సమస్యలు తగ్గుతాయి. బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. బాదంపప్పును తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు సంబంధిత కంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు చక్కటి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. డ్రై ఐ సిండ్రోమ్ ను తగ్గించడంలో కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలో, కంటిచూపును పెంచడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో, కంటికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ సి మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండ్లను వేసవి కాలంలో తీసుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లల్లో లుటీన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. వయసు పైబడడం వల్ల వచ్చే కంటిచూపు క్షీణతను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. కోడిగుడ్లను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. టమాటాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరచడంలో, ఎండ వల్ల కంటికి కలిగే నష్టాన్ని నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. టమాటాలను తీసుకోవడం వల్ల ఎండ వల్ల చర్మానికి కలిగే నష్టం కూడా తగ్గుతుంది. ఇక ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు రోజూ 8 గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఈ విధంగా నీటిని తాగుతూ ఆయా ఆహారాలను తీసుకోవడం వల్ల కళ్లకు హాని కలగకుండా ఉంటుంది.