Jailer | స్టంట్ సీన్ చేస్తుండగా ప్రమాదం… ఆసుపత్రిలో జైలర్ నటుడు.. అభిమానుల్లో ఆందోళన
Jailer | మలయాళ నటుడు వినాయకన్ పేరు వినగానే ఆయన సినిమాలకన్నా ముందుగా వివాదాలే గుర్తుకు వస్తాయి. మద్యం మత్తులో పబ్లిక్‌లో గొడవలు, పోలీస్ కేసులతో తరచూ వార్తల్లో నిలిచే వినాయకన్ ఈసారి మాత్రం వేరే కారణంతో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన హాస్పిటల్ పాలవడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Jailer | మలయాళ నటుడు వినాయకన్ పేరు వినగానే ఆయన సినిమాలకన్నా ముందుగా వివాదాలే గుర్తుకు వస్తాయి. మద్యం మత్తులో పబ్లిక్‌లో గొడవలు, పోలీస్ కేసులతో తరచూ వార్తల్లో నిలిచే వినాయకన్ ఈసారి మాత్రం వేరే కారణంతో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన హాస్పిటల్ పాలవడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రతో వినాయకన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆడు 3’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారు.
షూటింగ్లో భాగంగా తొడుపుజ ప్రాంతంలో ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన స్టంట్ చేస్తుండగా వినాయకన్ ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో ఆయన భుజం, మెడ ప్రాంతంలోని నరాలు, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, నరాల డ్యామేజ్‌ను ముందుగానే గుర్తించడంతో తీవ్ర పరిణామాలు జరగలేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వినాయకన్కు కనీసం ఆరు వారాల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ‘ఆడు 3’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు జయసూర్య హీరోగా నటిస్తున్న ఓ ఎపిక్ ఫాంటసీ చిత్రంలో కూడా వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.
వినాయకన్ కెరీర్ విషయానికి వస్తే… 1995లో విడుదలైన ‘మాంత్రికం’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు. 2016లో రాజీవ్ రవి దర్శకత్వంలో వచ్చిన ‘కమ్మట్టి పాదం’ చిత్రంలో గంగా పాత్రకు గాను కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించినప్పటికీ, ‘జైలర్’ సినిమాతో ఆయనకు ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది. అయితే ఈ విజయం తర్వాత కూడా వినాయకన్ వివాదాలకు దూరంగా ఉండలేకపోయారు. 2023 అక్టోబర్ 24న కొచ్చి ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో గొడవ సృష్టించిన కేసులో అరెస్టయ్యారు. అనంతరం వైద్య పరీక్షల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే 2024 సెప్టెంబర్ 7న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సిబ్బందితో జరిగిన గొడవ కారణంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2025 మే 9న ఓ హోటల్లో మద్యం మత్తులో రణరంగం సృష్టించినందుకూ కేసు నమోదైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Accident
- actor
- Jailer
- shooting time
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

