IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. సొంతగడ్డపై రెచ్చిపోయిన శుభ్‌మన్ గిల్ సేన టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు షాకిచ్చింది. భారీ ఛేదనలో వికెట్ కీపర్ జోస్ బట్లర్(97) విధ్వంసక హాఫ్ సెంచరీ సాధించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా.. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(43)తో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 119 రన్స్ జోడించడంతో ఐపీఎల్ చరిత్రలో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్. ఫలితంగా టేబుల్ టాపర్‌కు రెండో ఓటమి ఎదురైంది.
సొంతగడ్డపై గుజరాత్ టైటన్స్ పంజా విసిరింది. టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెక్ పెట్టింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్(97 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కగా 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(7)ను కరుణ్ నాయర్ రనౌట్ చేశాడు. దాంతో, 14 పరుగులకే తొలి వికెట్ పడింది. ఆ తర్వాత సాయి సుదర్శన్(36) అండగా జోస్ బట్లర్(97 నాటౌట్) ఢిల్లీ బౌలర్లను ఉతికేశాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 60 రన్స్ జోడించి గుజరాత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.
5️⃣0️⃣ reasons to believe, #GT fans 🤞
A fighting half-century from Jos Buttler and a 50* run partnership with Sherfane Rutherford keeps GT on track in the chase!
They need 66 runs in 36 balls.#TATAIPL | #GTvDC | @gujarat_titans | @josbuttler pic.twitter.com/58GaDTZF2f
— IndianPremierLeague (@IPL) April 19, 2025
అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. డేంజరస్ సుదర్శన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి రెండో వికెట్ అందించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 15వ ఓవర్లో రెచ్చిపోయిన బట్లర్ వరుసగా 4, 4, 4, 4, 4 బాది 20 రన్స్ పిండుకున్నాడు. దాంతో, గుజరాత్ గెలుపు వాకిట నిలిచింది. విజయానికి 11 పరగుల దూరంలో రూథర్‌ఫొర్డ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా(6) ఆఖరి ఓవర్లో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి వైడ్ రూపంలో 5 రన్స్ వచ్చాయి. దాంతో, గుజరాత్ ఖాతాలో ఐదో విజయం చేరింది.
Sherfane goes Ruthless with the bat! 🔥
🎥 Back-to-back sixes from him to make a loud and clear Impact! 💪#TATAIPL | #GTvDC | @gujarat_titans pic.twitter.com/CF1CaQnuIw
— IndianPremierLeague (@IPL) April 19, 2025
అహ్మదాబాద్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. అక్షర్ పటేల్(33) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రసిద్ కృష్ణ(4-41) హడలెత్తించినా.. ఆఖర్లో ఫినిషర్ అశుతోష్ శర్మ(37) సిక్సర్ల మోతతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.