INDW vs PAKW : క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం, ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించడం చూశాం. కానీ, మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌కు కీటకాలు (Bugs) అడ్డుపడ్డాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium)లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు జరుగుతుండగా భారీ కీటకాల దండు వచ్చింది. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్ ఎండ్ వద్ద చిన్నచిన్న పురుగులు పెద్ద సంఖ్యలో తిరగడం ప్రారంభించాయి. దాంతో.. టీమిండియా బ్యాటర్లు.. పాక్ బౌలర్ నష్ర ఇబ్బంది పడ్డారు. దాయాది కెప్టెన్ ఫాతిమా సనా పెస్ట్ స్ప్రే చల్లనా ఫలితం లేకపోవడంతో 34వ ఓవర్ తర్వాత అంపైర్లు ఆటకు కాసేపు బ్రేకిచ్చారు.
కొలంబోలో శనివారం భారీ వర్షం కారణంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. ఆదివారం కూడా మబ్బు వాతావరణం ఉండడంతో ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ముందే ఫ్లడ్లైట్స్ వేశారు. ఆ లైట్స్ వెలుగుకు భారీగా పురుగులు మైదానంలోకి వచ్చాయి. దాంతో, టీమిండియా బ్యాటర్లు బ్యాటుతో, పాక్ బౌలర్లు కర్చీఫ్‌తో ఆ కీటకాలను తరిమేయడానికి ప్రయత్నించారు. కానీ, అవి వాటిని వెళ్లగొట్టలేకపోయారు. దాంతో.. పాక్ సారథి ఫాతిమా సనా పురుగుల ఇబ్బంది గురించి అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
The break helps Pakistan. India lose Jemimah Rodrigues in the first over after the restart
5 down now as the bugs keep hovering around #CWC25https://t.co/IPT7MMDRw6 https://t.co/ETkgZBPcIB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2025
ఈ విషయాన్ని స్టేడియం సిబ్బందికి చెప్పగా వారు చివరకు పెస్ట్ కంట్రోల్ స్ప్రేను ఉపయోగించాల్సి వచ్చింది. 34వ ఓవర్ తర్వాత సిబ్బంది ఒకరు స్ప్రే చల్లేందుకు రావడంతో సుమారు 15 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు అంపైర్లు. అప్పటికీ భారత్ స్కోర్ 154-4. అయితే.. ఓవర్లలో కోత మాత్రం ఉండదని అంపైర్లు వెల్లడించారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 ఓవర్ పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
Bugs attack! Ind-Pak match paused for bizarre reason – watch pic.twitter.com/bBCq8mh5uG
— Gags (@CatchOfThe40986) October 5, 2025