Stuart Broad | ఆఖరి బంతికి సిక్స్, వికెట్.. 146 ఏండ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
Stuart Broad : యాషెస్ సిరీస్(Ashes Series)తో అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెరీర్ చివరి మ్యాచ్‌లో ఈ స్పీడ్‌స్టర్ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో మరే ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన...
Stuart Broad : యాషెస్ సిరీస్(Ashes Series)తో అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెరీర్ చివరి మ్యాచ్‌లో ఈ స్పీడ్‌స్టర్ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో మరే ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్ ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్(Mitchell Starc) బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. దాంతో, కెరీర్లో ఎదుర్కొన్న చివరి బంతికి సిక్సర్ కొట్టిన క్రికెటర్‌గా బ్రాడ్ రికార్డు సృష్టించాడు.
బౌలింగ్‌లోనూ సత్తాచాటిన బ్రాడ్ ఆఖరి బాల్‌కు వికెట్ పడగొట్టాడు. కంగారూ వికెట్ కీపర్ అలెక్స్ కారీ(Alex Carey)ని ఔట్ చేయడం ద్వారా కెరీర్‌కు ఘనమైన ముగింపునిచ్చిన బ్రాడ్ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. దాంతో, 146 ఏండ్ల టెస్టుక్రికెట్ చరిత్రలో ఇలా చివరి బంతికి సిక్సర్ బాదడంతో పాటు ఆఖరి బంతికి వికెట్ పడగొట్టిన తొలి ప్లేయర్‌గా బ్రాడ్ చరిత్రకెక్కాడు. చివరి టెస్టులో ఇంగ్లిష్ జట్టు 49 పరుగులు తేడాతో గెలుపొంది యాషెస్ సిరీస్ 2-2ను డ్రా చేసుకుంది.
వికెట్ తీసిన బ్రాడ్‌కు సహచరుల అభినందన

యువరాజ్ సింగ్ ధాటికి..
ఇంగ్లండ్ గొప్ప బౌలర్లలో ఒకడైన బ్రాడ్ దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ20 ప్రపంచ కప్(T20 World Cup)ను మర్చిపోలేడు. ఆ టోర్నీలో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధాటికి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకున్నాడు. యూవీ సిక్సర్ల మోతకు బలి కావడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అదొక చేదు జ్ఞాపకమని బ్రాడ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో చెప్పడం విశేషం.
యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్

అయితే.. ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలోనే గొప్ప బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు 166 టెస్టులాడిన బ్రాడ్ 600 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 121 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రాడ్ 178 వికెట్లు పడగొట్టాడు. 56 టీ20ల్లో 65 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా గుర్తింపు సాధించాడు.
ఇవి కూడా చదవండి
BCCI | భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్లకు పిలుపు
Kapil Dev Vs Jadeja | ఎవరూ తేలిగ్గా తీసుకోవడం లేదు..! కపిల్ దేవ్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

