ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఆరంభం నుంచి రాయల్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు వికెట్లు తీయగా..ముస్తాఫిజుర్ రహమాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆరంభంలోనే రాజస్థాన్ పేసర్ఉనద్కత్ ధాటికి పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. టాప్-3 బ్యాట్స్‌మన్ పృథ్వీ షా(2), శిఖర్ ధావన్(9), రహానె(8)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. ముస్తాఫిజుర్ వేసిన ఏడో ఓవర్లో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్ ఔటవడంతో ఢిల్లీ 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. హాఫ్‌సెంచరీ సాధించి దూకుడుమీదున్న పంత్ 13వ ఓవర్లో రనౌటయ్యాడు. దీంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో లలిత్ యాదవ్(20), టామ్ కరన్(21) ఫర్వాలేదనిపించారు.
Caught & bowled! ☝️@JUnadkat is on a roll here at the Wankhede Stadium & scalps his third wicket. 👏👏#DC lose Ajinkya Rahane. #VIVOIPL #RRvDC @Vivo_India @rajasthanroyals
— IndianPremierLeague (@IPL) April 15, 2021
Follow the match 👉 https://t.co/SClUCyADm2 pic.twitter.com/Nv3Dk7Amrn