గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 00:29:35

ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్‌, అశిష్‌

ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్‌, అశిష్‌
  • ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌

అమన్‌(జోర్డాన్‌):  ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ తొలి రోజు భారత బాక్సర్లు అదరగొట్టారు. మంగళవారం జరిగిన వేర్వేరు బౌట్లలో విజయాలతో గౌరవ్‌ సోలంకి(57కి), అశిష్‌ కుమార్‌ (75కి) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ విజేత అయిన గౌరవ్‌ 5-0తో అకిల్‌బెక్‌ ఎసెన్‌బెక్‌(కిర్గిస్థాన్‌)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచి తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన సోలంకి.. ప్రత్యర్థి బాక్సర్‌పై తనదైన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. పదునైన పంచ్‌లకు తోడు జాబ్స్‌, హుక్స్‌తో చెలరేగడంతో ప్రత్యర్థి నుంచి సమాధానం లేకపోయింది. మరో బౌట్‌లో అశిష్‌ కుమార్‌..కన్‌చీ వి(తైవాన్‌)ను 5-0తో చిత్తుచేశాడు. మెరుగైన ప్రాక్టీస్‌ వల్లే తాను ఈ విజయం సాధించానని బౌట్‌ తర్వాత అశిష్‌ అన్నాడు. క్లీన్‌ పంచ్‌లతో విరుచుకుపడుతూ పాయింట్లు కొల్లగొట్టాడు. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరే వారికి టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు దక్కుతుంది. భారత స్టార్లు అమిత్‌ పంగల్‌, మేరీకోం బుధవారం బరిలోకి దిగనున్నారు. 


logo