Wine Shops Close | సాయంత్రం 5 నుంచి 13న పోలింగ్ ముగిసే వరకు.. మద్యం అమ్మకాలు బంద్
రెండు నెలలుగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది
హైదరాబాద్: రెండు నెలలుగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు (Wine Shops Close) మూతపడనున్నాయి. ఎలాంటి లైసెన్సులు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో మద్యం ప్రియులు వరుసగా సెలవులు ఉడంతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. తమకు అవసరమైన సరుకును తెచ్చిపెట్టుకుంటున్నారు.
కాగా, ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్ ముగిసింది. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతోపాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు.
లక్షకుపైగా ఈవీఎంలు
13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

