Boxer Saweety Boora | హిసార్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు దీపక్ హుడాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా బాక్సర్ స్వీటీ బూర.. పోలీస్ స్టేషన్లోనే అతడిపై భౌతిక దాడికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… తనకు విడాకులు కావాలని కోరుతూ హిసార్‌లోని పోలీస్ స్టేషన్లో స్వీటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న హుడా అతడి కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరయ్యాడు.
ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్లో ఉండగా మాటామాటా పెరిగి సహనం కోల్పోయిన స్వీటీ.. హుడాపై దాడికి దిగింది. అతడి గొంతు పట్టుకుని నులుమబోయింది. అక్కడే ఉన్న ఇరు కుటుంబ సభ్యుల జోక్యంతో ఆమె శాంతించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అయ్యింది.
🚨 World Champion Boxer Saweety Bora tried to assault her husband Kabbadi Star Deepak Hooda in Police Station
They have reportedly filed for divorce!pic.twitter.com/TNEkdVujvU https://t.co/lzyyjeLv3W
— The Khel India (@TheKhelIndia) March 25, 2025
ఈ ఘటన అనంతరం స్వీటీ స్పందిస్తూ…‘నేను అతడితో జీవించదలుచుకోలేదు. నాకు అతడి నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. విడాకులు ఇప్పించండి చాలు. ఇదే విషయంపై నేను ఈనెల 11న హిసార్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకూ దానిపై విచారణ జరిపించలేదు. నాకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను వేడుకుంటున్నా’ అని భావోద్వేగానికి గురైంది. 2022లో వీరి వివాహం జరుగగా అదనపు కట్నం కోసం హుడా కుటుంబం వేధిస్తోందని స్వీటీ రెండు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించింది.